దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దేశంలో కరోనా కనుమరుగు కాకముందే డెంగీ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో డెంగీ భారీన పడి ఐఐటీ విద్యార్థిని దీక్షిత మృతి చెందింది. 
 
వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన దీక్షిత ఐఐటీలో ఆల్‌ఇండియా 241 వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్‌ హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. డెంగీ భారీన పడి కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వగ్రామమైన చంద్రనాయక్‌ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఆమె తండ్రి ఖననం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: