ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 3,427కు చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్నటివరకు 4,23,604 కరోనా పరీక్షలు జరిగాయి. దేశంలో మరే రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా పరీక్షలు జరగలేదు. ఈ పరీక్షల్లో రాష్ట్రంలో 3,427 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది , విదేశాల నుంచి తిరిగి వచ్చిన 119 మంది కరోనా భారీన పడ్డారు. మే 1, 2020 నాటికి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ పరీక్షల సంఖ్య లక్ష దాటగా నెల రోజుల్లో రాష్ట్రంలో మూడు లక్షల పరీక్షలు జరిగాయి. ఒక మిలియన్ జనాభాకు ఆంధ్రప్రదేశ్ లో 7748 టెస్ట్ లు జరుపుతూ దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవగా కరోనా పరీక్షల్లో 6864 టెస్టుల తో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా 69 శాతానికి పెరగడం గమనార్హం. తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా పల్లెలకు వైరస్ పాకడం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. గోదావరి జిల్లాల్లోని పల్లెల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: