వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రయోజనం పొంది ఉండకూడదని... సొంత ఇళ్లు ఉండకూడదని చెప్పారు. ఈ మూడు నిబంధనల మేరకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని బుగ్గన తెలిపారు. నిబంధనల మేరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే అవినీతి ఎలా జరుగుతుందని చంద్రబాబును ప్రశ్నించారు. 
 
దరఖాస్తులు స్వీకరించిన తరువాత మూడుసార్లు గ్రామ సభలు నిర్వహించి అర్హులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేశామని... దరఖాస్తు చేసుకోవడానికి మూడుసార్లు అవకాశం కల్పించామని చెప్పారు. చంద్రబాబు హయాంలో 6.85 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని... చంద్రబాబు అబద్ధపు లెక్కలు చెబుతున్నారని చెప్పారు. మే నెలలో మరోసారి దరఖాస్తులు స్వీకరించామని 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని బుగ్గన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: