సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. మియా మాల్కోవా తో జీఎస్టీ సినిమాను తీసి సంచలనం సృష్టించిన వర్మ ఆ తరువాత క్లైమాక్స్ సినిమాని మరోసారి మియా మాల్కోవా తో  తీసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అదేవిధంగా గాడ్సే ఉదంతంతో ఓ సినిమాను చేస్తున్నాడు. ఆ వెంటనే కరోనా మహమ్మారి పై మొట్టమొదటి సినిమాను ప్లాన్ చేస్తున్నాడు మరియు దాదాపు పూర్తి చేశాడు కూడా. అయితే ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు.

 

అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రైలర్లో  కాస్త ఫన్నీ గా సమాధానాలను ఇచ్చే ప్రయత్నం చేశాడు మన వర్మ. ముఖ్యంగా మియా మాల్కోవతో ఆయాకు గల సంబంధ భాందవ్యాలు , కేఏ పాలతో ఆయనకు గల అవినాభావ సంబంధం, లాక్ డౌన్ సమయంలో హీరో హీరోయిన్ లతో సినిమాలను ఎలాచేసాడో వివరించాడు ...మొత్తానికి ఆ ట్రైలర్ వీడియో చూస్తుంటే ...వర్మ చెబుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలపై ఆసక్తిని రేకెత్తిస్తోంది ! అయితే ఈ ఇంటర్వ్యూ ను సాయంత్రం 8 గంటలకు tv9  లో టెలికాస్ట్ చేయనున్నారు ఛానల్ నిర్వాహకులు 

మరింత సమాచారం తెలుసుకోండి: