కరోనా వైరస్ విజృంభణ వల్ల నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీకి నష్టాలు మరింత పెరిగాయి. కరోనా వల్ల కుదేలైన ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మొదట జిల్లా కేంద్రాలలో అనంతరం ప్రధాన పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సొంతంగా నడిపించాలా..? లేదంటే పెట్రోలియం సంస్థలకు లీజుకు ఇవ్వాలా...? అనే అంశం గురించి చర్చలు జరుగుతున్నాయి. 
 
గత మూడు రోజులుగా ఈ విషయం గురించి సాధ్యాసాధ్యాలను అధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండుల సమీపంలో పెట్రోల్ బంకులు లేకపోవడంతో బంకులు ఏర్పాటు చేస్తే కాంట్రాక్టు పద్దతిలో నడుపుతున్న బస్సులకు ఇంధనం సమకూరుతుందని... ఆర్టీసీకి అదనపు ఆదాయం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: