కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి ఆలయాలకు, ప్రార్థనామందిరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాలు తెరచుకోవటానికి అనుమతులు ఇచ్చింది. తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పించేలా బోర్డు సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్‌లో భక్తులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు. 
 
అయితే తిరుపతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయ దర్శనాలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కంటైన్మెంట్ జోన్‌లో శ్రీకాళహస్తి ఉండటంతో స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిని నిషేదిస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ చెప్పారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తరువాత మాత్రమే దర్శనానికి అనుమతులు ఇస్తామని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: