మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్  కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం శశి ప్రీతమ్  ఐసీయూలో ఉన్నారు. అయితే శశి ప్రీతమ్  పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. శశి ప్రీతమ్  సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే అన్న విషయం తెలిసిందే.

 

సంగీత దర్శకుడిగా శశి ప్రీతమ్  కు మంచి గుర్తింపు ఉంది . అటు తెలుగుతో పాటూ  వివిధ భాషల్లో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శశి ప్రీతమ్ . తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలకు సంగీతం అందించి ఎంతో మంది సినీ ప్రేక్షకులను అలరించారు. కాగా శశి ప్రీతమ్  కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: