దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు కీ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతుంది.  ప్రస్తుతం ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో ఏడవ స్థానంలో ఉన్న భారత్, మరో రెండు వారాల్లో... అంటే జూన్ నెల మధ్యలోనే టాప్-4కు చేరే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ప్రకారం పరిశీలిస్తే, ఈ వారంలోనే మనకన్నా ముందున్న ఇటలీ, స్పెయిన్ లను అధిగమిస్తుందని, ఆపై మరికొన్ని రోజుల్లోనే యూకేను అధిగమించి 4వ స్థానానికి చేరుతుందని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు.

 

దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం, ఆదివారం  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు.   అక్కడ పూర్తిగా శానిటైజేషన్ పూర్తయిన తర్వాత తెరుస్తామని.. 2 రోజులపాటు అధికారులకు, సందర్శకులకు అనుమతి లేదని ప్రకటన విడుదల చేశారు ఆరోగ్యశాఖ అధికారులు. ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉద్యోగులు పాటించాల్సిన 40 నిబంధనల్ని విడుదల చేసినట్లు తెలిపారు. 

 

మాస్కులు తప్పనిసరి, కంటైనమెంట్ జోన్ల నుంచి వచ్చే డ్రైవర్లు అనుమతి నిరాకరణ, సామాజిక దూరం పాటించడం, ఏసీల వాడకం నిలుపుదల, ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండటం పై నిషేధం, నేరుగా ఫైల్స్ తీసుకోవడం నిషేధం, ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించే సమావేశాలకు మినహాయింపులు లాంటి రూల్స్ ను పాటించాలని తెలిపారు అధికారులు. ఆరోగ్య శాఖలో కరోనా పాజిటీవ్ అనగానే అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: