మరో మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ వల్ల గతంతో పోలిస్తే రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఇన్విజిలేషన్ చేయాల్సిన టీచర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతంలో పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసిన టీచర్లకే విద్యాశాఖ ఇన్విజిలేషన్ విధులు అప్పగించేది. కానీ ఈసారి ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది కూడా అవసరమైంది. 
 
కానీ ప్రైవేట్ పాఠశాలల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జీతాలు ఇవ్వలేమని పెద్దఎత్తున టీచర్లను తొలగించాయి. దీంతో ఇన్విజిలేషన్ డ్యూటీల విషయంలో గందరగోళం నెలకొంది. మరోవైపు పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టళ్లలో చదువుకున్న ఇతర ప్రాంతాల విద్యార్థులకు సొంత ప్రాంతాల్లోనే పరీక్ష రాసే అవకాశం కల్పించింది. విద్యార్థుల వివరాలను డీఈవోలకు పంపాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: