IHG

సేలం లో నివసిస్తున్న సురేష్ కుమార్ మరియు రేవతి అనే దంపతులకు ఉదయ్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు .వీరు సొంత వూరు సేలం. ఉదయ్ కుమారు (19) త్రిచి అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భారత దేశానికీ మిడతల దండు వచ్చి పంట పొలాలను నాశనం చేస్తోంది అన్న వార్తను విన్న ఉదయ్ కుమార్ దేశానికీ తనవంతు సాయం చేయాలన్న ఉద్దేశం తో ఓ యంత్రాన్ని కనిపెట్టాడు. ఈ యంత్రం యొక్క నేపధ్యాన్ని ఉదయ్ కుమార్ వివరిస్తూ ..భారత దేశం లోని పలురాష్ట్రాలలో మిడతలను చంపడానికి పురుగు మందులను వినియోగిస్తారు మరియు అందుకోసం వేల ఖర్చును చేస్తారు. కానీ తాను కనిపెట్టిన యంత్రం ద్వారా తక్కువ ఖర్చుతో మిడతలను చంపవచ్చని పేర్కొన్నాడు.

 

 

ఉదయ్ కుమార్ చెబుతూ ..ఈ యంత్రాన్ని ఒక ఎలక్ట్రిక్ బల్బ్ మరియు దాని చుట్టూ మిడతలు రావడం కోసం రెండు-ఫైర్ వైర్ మెష్ లను అమరుస్తున్నట్లు తెలిపాడు. ఇందులో పడిన మిడతలు విద్యుత్ ఘాతానికి గురై చనిపోతాయి. దీనికి కేవలం 11 వేల రూపాయల కార్చుమాత్రమే అవుతుంది. దీనిని రాత్రి పూట పంట పొలాల్లో ఉంచినట్లయితే నాలుగు రోజుల్లో  లక్ష మిడతల వరకు చనిపోయే అవకాశం ఉంది. సాధనం యొక్క దిగువ భాగంలో ఉన్న ప్లాస్టిక్ కాగితాన్ని చనిపోయిన మిడుతలను తీయడానికి వాడతారు మరియు ఆ మిడతలను ఎరువుగా ఉపయోగించవచ్చు. ప్రభుత్వం దీనిని అడిగితే, ఇలాంటి అనేక పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం నాకు సహాయం చేయాలి, ”అని అన్నాడు .

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: