తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. హైద‌రాబాద్ హాట్‌స్పాట్‌గా మార‌గా క్ర‌మంగా ప‌ల్లెల‌కూ విస్త‌రిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులు అనంతరం కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 143 కేసులు నమోదుకాగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 116 కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క‌రోజే  8 మంది మృతి చెందారు.  అయితే.. శుక్రవారం నాడు భారీగా కేసులు నమోదవ్వడం.. ఒకేసారి 8 మంది మృతిచెందడంతో రాష్ట్ర ప్రజలను.. మరీ ముఖ్యంగా హైదరాబాదీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

తాజాగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,290కి చేరింది. మరోవైపు.. జీహెచ్‌ఎంసీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,138కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 113 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,627 మంది డిశ్చార్జ్‌ కాగా..  ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,550గా ఉంది. కాగా.. కరోనా నుంచి కోలుకుని శుక్రవారం నాడు కొత్తగా 40 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: