క‌రోనా వైర‌స్ కార‌ణంగా బ్రెజిల్ చిగురుటాకులా వ‌ణికిపోతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. రోజువారీగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించిన ప్ర‌పంచ‌ దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా క‌రోనా మరణాల సంఖ్య 400,000 కు చేరుకుంది. బ్రెజిల్ ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారి సంఖ్య 34,000 కు పెరిగింది. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 110,000 మందికి పైగా మరణించారు.

 

ఆ త‌ర్వాత బ్రిటన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 40,200 కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. లాటిన్ అమెరికాలో అత్యధికంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రెజిల్ మొద‌టిస్థానంలో ఉంది. అలాగే.. మెక్సికో, పెరూ, ఈక్వెడార్ మరియు చిలీలలో కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: