కరోనావైరస్ కోసం మందులు మరియు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి గానూ ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు కృషి చేస్తున్నాయని, ఈ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని ఫిక్కీ లేడీస్ నిర్వహించిన వెబ్‌నార్‌లో డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ కో-చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ తెలిపారు.

 

భారతదేశంలో ఆవిష్కరణలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా, మహమ్మారిపై పోరాడటానికి మందులను కనుక్కునే విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కోవిడ్ -19 తో పోరాడటానికి పరిష్కారాలలో భారతదేశం చురుకైన పాత్ర పోషిస్తుందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. సంస్థలను ఎలా పునర్నిర్మించాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దృష్టి పెట్టాలని ప్రసాద్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. హద్దులేని జీవన విధానం భూమిని నాశనం చేసిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: