ఈ నెల 9 న సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలవడానికి గానూ నిర్ణయించారు. ఈ మేరకు సిఎం జగన్ ఆపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ దర్శకులు నిర్మాతలు అందరూ కూడా జగన్ ని కలవనున్నారు. ఏపీలో సినిమాల షూటింగ్ తో పాటుగా సినిమాల విడుదలకు సంబంధించి కూడా ఈ బృందం జగన్ తో చర్చించే అవకాశం ఉంది. 

 

ఇప్పటికే తెలంగాణ సిఎం కేసీఆర్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ నెల నుంచి సినిమాల షూటింగ్ కి అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కలిసి తమ సమస్యలను వినిపించే ఆలోచనలో సినీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఏపీలో సినిమాల షూటింగ్ లకు సింగిల్ విండో అనుమతులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: