దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారితో జనాలు వణికి పోతున్నాను.. ప్రతిరోజూ మరణాలు, కేసులు పెరుగుదలతో సతమతమవుతుంటే.. ఇప్పుడు జనావాసాల్లోకి కృర మృగాల సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా చిరుత సంచారాలు,  ఎలుగు దాడులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అడవులను వదిలి వన్యప్రాణులు తరుచూ గ్రామాలు నగరాలనే తేడా లేకుండా జనసంచారంలోకి వస్తూ భయపెడుతూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నడిరోడ్డుపైకి చిరుత సంచారం కలకలం సృష్టించగా.. తాజాగా తిరుమల ఘాట్ రోడ్డులోనూ ఓ చిరుత హడలెత్తించింది. అర్థరాత్రి పూట ఎలుగు బంట్లు తిరుగుతున్నాయి. 

 

తాజాగా మహనంది పుణ్యక్షేత్రం సమీపంలో ఆలయ సిబ్బందికి ఓ చిరుత కనిపించింది. అది గోశాలకు పక్కనే ఉన్నఓ పంది పిల్లపై దాడి చేసి దాన్ని నోట కరుచుకొని తీసుకెళ్లింది. ఓ చెట్టు ఎక్కి తినే ప్రయత్నం చేయగా.. స్థానికులు అరవడంతో భయందో అక్కడే వదిలేసి పారిపోయింది. దీంతో వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  ఇక పులిగి అడుగు జాడలు కనుగొనే పనిలో అటవీ సిబ్బంది ఉన్నారు.  ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తరచూ ఇవి కనిపిస్తుండటం విశేషం. ఆలయాలు తెరుస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో జనాలు భయపడిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: