ఈ మధ్య కాలంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ వివాహాలు చేసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. యువతలో చాలామంది కులాంతర వివాహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కుల రహిత సమాజాన్ని నిర్మించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కూడా వీరికి అండగా నిలుస్తోంది. తెలంగాణ సర్కార్ కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.2.50 లక్షల నజరానా ప్రకటించింది. గతంలో 50,000 రూపాయలుగా ఉన్న ఆర్ధిక సాయాన్ని ఐదు రెట్లు పెంచింది. 
 
వేరువేరు కులాలకు చెందిన యువతీయువకులు వివాహానికి సంబంధించిన ఆధారాలతో వారు స్థానిక జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అనంతరం బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుంది. దరఖాస్తు కోసం వివాహం చేసుకున్న వధూవరుల మూడు ఫోటోలు, కుల ధృవీకరణ పత్రాలు, స్కూల్ టీసీ, వివాహ ధృవీకరణ పత్రం, దంపతుల జాయింట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, సాక్షుల వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు అవసరమవుతాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: