ఓ వైపు కరోనా వైరస్ తో ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. మరోవైను కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు.  కామాంధులు గురించి ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. ఇక హైదరాబాద్ లో వరుస హత్యలతో బెంబేలెత్తిపోతున్నారు జనాలు.   లంగర్‌హౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీషీటర్‌ హర్షద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబూ, చాంద్‌ మహ్మద్‌ను హర్షద్ గ్యాంగ్ కత్తులతో నరికి హత్య చేసినట్లు నిర్ధారించారు.  ఐదుగురు నిందితులను అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

 

మరోవైపు ఈ సంఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కొన్ని గంటల్లోనే హత్య కేసును ఛేదించారు. రౌడీషీటర్లు చాంద్, ఇబ్రహీం కు మధ్య గొడవలు నడుస్తున్నాయి. వీరిద్దరి మధ్య గ్యాంగ్ వార్ కూడా నడుస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి కూడా చందు ,ఇబ్రహీం కు భయపడి ముంబైలో తలదాచుకున్నాడు.   జంట హత్యల కేసును వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నాలుగు గంటల్లో ఛేదించారు. హత్యకు పాల్పడిన అశ్వక్‌ గ్యాంగ్‌లోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదిపత్య పోరులో భాగంగానే హత్యలు జరిగాయని పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: