ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా చర్యలు చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకణపై ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఆరోగ్యం, శిశు సంక్షేమం, విద్య, అటవీ, గిరిజన సంక్షేమం, న్యాయ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. 
 
శాఖలవారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీఎస్ నీలం సాహ్ని వివిధ శాఖల ఉన్నతాధికారులతో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం క్రమబద్ధీకరణ దిశగా చర్యలు ప్రారంభించడంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పని చేస్తున్న వారికి ప్రభుత్వం అతి త్వరలో శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: