భారత్ లో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశంలో లాక్ డౌన్ నిబంధనలు సడలించటంతో వైరస్ ఏ క్షణమైనా తీవ్రరూపం దాల్చవచ్చని చెప్పారు. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పడుతున్న సమయం, సామూహిక వ్యాప్తిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 
 
భారత్ లో వైరస్ విజృంభిస్తుందని ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ లో కేసులు రెట్టింపయ్యే సమయం మూడు వారాలుగా ఉందని చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ ఉండటంతో బాధ్యత పూర్తిగా ప్రజలపై ఉందని చీఫ్ సైంటిస్ట్ సౌమ్య చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: