ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి బీసీలకు పెద్దపీట వేసింది. గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కోటీ 78 లక్షల బీసీలకు వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా 19,308 కోట్ల రూపాయల సాయం చేసింది. సీఎం జగన్ ఎన్నికల ముందు బీసీ గర్జనలో ఇచ్చిన మాట మేరకు బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తున్నారు. 
 
సీఎం జగన్ వైయస్సార్ రైతు భరోసా(రెండు విడతలు), వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ వాహన మిత్ర, వైయస్సార్ సున్నావడ్డీ, లా నేస్తం, వైయస్సార్ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా(రెండు సార్లు), జగనన్న అమ్మఒడి, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ కంటి వెలుగు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, ఎం.ఎస్.ఎం.ఈ రీ స్టార్ట్ పథకాల ద్వారా బీసీలకు లబ్ధి చేకూర్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: