ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలంగాణ రాష్ట్రంతో వివాదాలు, విబేధాలు కోరుకోవట్లేదని అన్నారు. గోదావరి నీటిపై తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవని చెప్పారు. గోదావరి యాజమాన్య బోర్డు నుంచి దీని గురించి స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. వెనుకబడిన రాయలసీమకు నీటిని అందించాలనేదే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులలో తమకు రావాల్సిన వాటాలను మాత్రమే వినియోగించుకుంటున్నామని అన్నారు. 
 
అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసి తీరుతామని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు పోలవరం గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు. వైయస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని సీఎం జగన్ పూర్తి చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: