దేశ వ్యాప్తంగా వలస కార్మికులను తరలించడానికి గానూ ఇప్పుడు కేంద్రం శ్రామిక్ ట్రైన్స్ ని దేశ వ్యాప్తంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా తీవ్రత పెరగడం వారికి ఉపాధి లేకపోవడంతో ఇప్పుడు కేంద్రం వారిని సొంత ఊర్లకు తరలిస్తుంది. దీనిపై రైల్వే శాఖ స్పందించింది. ఇప్పటి వరకు ఎంత మందిని సొంత ఊర్లకు తీసుకుని వెళ్ళింది రైల్వే శాఖ తెలిపింది. 

 

58 లక్షల మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు 4,286 శ్రామిక ప్రత్యేక రైళ్లు ఇప్పటి వరకు తీసుకుని వెళ్ళాయి అని... ఈ రైళ్లకు డిమాండ్ రోజుకు 250 నుండి 137 కి తగ్గిందని రైల్వే శాఖ పేర్కొంది. గత 2 రోజుల్లో మేము 56 రైళ్లను నడిపామని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: