అత్తారింటికి దారేది, ఆఆ సినిమాలతో హీరోయిన్ లకు అమ్మగా బాగా పాపులర్ అయింది నదియా. ఆమె నటనతో పాటుగా గ్లామర్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆమెను జనాలు ఆయా సినిమాల్లో బాగానే ఆదరించారు అని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుతం మన తెలుగులో ఏ సినిమా కూడా చేయడం లేదు. ఇటీవల ఆమె కొన్ని కొన్ని సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేసినా సరే అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఇప్పుడు ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. సాధారణంగా సినిమాల్లో త్రివిక్రమ్ ఎక్కువగా పాత హీరోయిన్ లను తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈమెను ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. అత్తారింటికి దారేది అఆ సినిమాల్లో ఆమె పాత్ర చాలా బాగా హైలెట్ అయింది. ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. 

 

అందుకే ఇప్పుడు ఆమెను ఈ సినిమాలో కూడా తీసుకుని ఒక కీలక పాత్ర ఇచ్చే ప్రయత్న౦ చేస్తున్నట్టు సమాచారం. దాదాపు ఆమె ఎన్టీఆర్ కి అమ్మగా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. దీనికి సంబంధించి చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి అని సమాచారం. కాగా ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అనేది చెప్పడం కాస్త కష్టమే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయిని అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: