ఈశాన్య భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముందు నుంచి కరోనా విషయంలో చాలా సమర్ధవంతంగా వ్యవహరించిన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక నానా ఇబ్బందులు పడుతున్నాయి. అక్కడ కరోనా వ్యాప్తి ప్రస్తుతం కంట్రోల్ లోనే ఉంది. 

 

అయితే కేసులు మాత్రం చాలా వేగంగా నమోదు అవుతున్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో అక్కడ కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఉత్తరభారతంలో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తుంది. సిక్కిం, త్రిపుర లో మాత్రం ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: