గుజరాత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశాలు కనపడటం లేదు. కరోనా కట్టడికి విజయ్ రూపాని సర్కార్ నిర్ణయాలను కఠినం గా అమలు చేస్తున్నా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు అని చెప్పవచ్చు. కేసులు కాస్త తగ్గుతున్నా సరే మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. అక్కడ మరణాల సంఖ్యా వేగంగా పెరుగుతుంది అని అక్కడి అధికారులు చెప్తున్నారు. గుజరాత్‌లో రోజుకు 20 నుంచి 30 మంది వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

రోజు రోజుకి మరణాలు పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారం తో పోల్చి చూసినప్పుడు ఇప్పటికి కేసులు తక్కువగానే ఉన్నా సరే మరణాలు మాత్రం ఆగకపోవడంతో ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక నుంచి లాక్ డౌన్ ని కఠినంగా అమలు చెయ్యాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: