నిసర్గ తుఫాన్ మహారాష్ట్రాని అతలాకుతలం చేసింది . దీని ధాటికి మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఎక్కువగా రత్నగిరి  మరియు  సింధుదుర్గ్  జిల్లాల్లో భారీగా తుఫాన్ నష్టాన్ని కలిగించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం 100 కోట్ల భారీ ప్యాకేజిని ప్రకటించారు. భారీగా నష్టపోయిన రత్నగిరిగీ జిల్లాకు 75 కోట్లు మరియు సింధుదుర్గ్ కి 25 కోట్లను ప్రకటించారు.  తుఫాన్ కారణంగా నష్టపోయిన ఇతర జిల్లాలకు కూడా నష్టాన్ని అంచనావేసి నష్టపరిహారాన్ని అందజేస్తామని ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో, ఇళ్ళు మరియు వ్యవసాయ భూములకు భారీ నష్టం వాటిల్లిన రత్నగిరి తుఫాను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.

 

రత్నగిరి, సింధుదుర్గ్ రెండింటినీ త్వరలో సందర్శిస్తామని సిఎం హామీ ఇచ్చారు. రత్నగిరి ని  సందర్శించిన రత్నగిరి సంరక్షక మంత్రి అనిల్ పరాబ్ ఆ జిల్లాలో భారీగా నష్టం చోటుచేసుకుందని తెలియజేసారు. అనేక గ్రామాలు నాశనమయ్యాయని ఠాక్రేకు తెలియజేశారు. సిమెంటు పైకప్పు పలకలు ఎగిరిపోతున్నందున ప్రజలు ఉండటానికి స్థలాలు లేవని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాల్సిన ఆహార ధాన్యాల స్టాక్ పూర్తిగా తడచిపోయాయని అయన తెలియజేసారు. అదేవిధంగా ప్రాధమిక అంచనాల ప్రకారం, జిల్లాలో ₹ 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారి తెలిపారు.జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని రాయ్‌గడ్ సంరక్షక మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: