కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయని తెలంగాణా మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కరెంట్ బిల్లులు పెరగడంపై తీవ్ర దుమారం రేపుతున్న నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు మంత్రి. లాక్ డౌన్ లో విద్యుత్ వాడకం చాలా భారీగా పెరిగింది అని ఆయన అన్నారు. 

 

అదే విధంగా లాక్ డౌన్ తో విద్యుత్ రీడింగ్ తీయడానికి గానూ సిబ్బంది ఇళ్ళకు వెళ్ళలేదు అని అయన పేర్కొన్నారు. ఈఆర్సి సూచనల మేరకే గత ఏడాది మార్చ్ ఏప్రిల్ బిల్లులను ఈ సారి వసూలు చేసామని ఆయన అన్నారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు కష్టపడి పని చేసారు అని ఆయన కొనియాడారు. లాక్ డౌన్ లో జనం ఇంట్లోనే ఉన్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: