ఓ వైపు ప్రభుత్వాలు పెద్ద పెద్ద కంపెనీలకు, ఫ్యాక్టరీలకు తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నా కొంత మంది యజమానుల నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఆ మద్య వైజాగ్ లో గ్యాస్ లీక్ తో పద్నాలు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత   గుజ‌రాత్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టీరీలో భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు.    పారిశ్రామక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో  బాయిల‌ర్‌ పేలుళ్లు సంభ‌వించ‌డంతో పెద్ద ఎత్తున‌ మంట‌లు ఎగిసిపడ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మ‌ర‌ణించ‌గా, ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే సుమారు 40 మంది సిబ్బంది తీవ్రంగా గాయాల‌పాలయ్యారు.

 

ఇవన్నీ మర్చిపోకముందే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ అద్దకం ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బాయిలర్‌కు అటాచ్ చేసిన వేడినీటి పైపు పేలిపోయింది. దీంతో ఆరుగురు కార్మికులు తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. వివేక్‌లెనే ఇండస్ట్రీలో ఈ ప్రమాదం జరిగింది. పైపు వద్ద నిద్రిస్తున్న కార్మికులపై సలసల కాగే వేడినీళ్లు పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: