కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేశారు. సరిహద్దుల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో అందరికి తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి రాహుల్ చురకలంటించారు. అమెరికా, ఇజ్రాయెల్ తరవాత సరిహద్దులను రక్షించుకోగల సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. 
 
గత నెలరోజులుగా భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా ఈ ప్రతిష్టంభనను ముగింపు పలకాలని ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమిత్‌ షా తాజాగా బిహార్ జన్‌సంవద్ వర్చువల్ ర్యాలీలో మాట్లాడుతూ సర్జికల్, ఎయిర్ స్ట్రయిక్స్ ద్వారా భారత్ రక్షణ విధానంపై బలమైన సందేశం పంపిందని.... సరిహద్దులను ఎలా రక్షించుకోగలమో చెప్పిందని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: