సినిమా షూటింగులు, టీవీ కార్యక్రమాల షూటింగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఫైలుపై సంతకం చేశారు. అయితే, కొన్ని నిబంధనలను పాటిస్తూ షూటింగ్ జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ మద్య తలసాని శ్రీనివాస్ ని టాలీవుడ్ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నేడు నిలబెట్టుకున్నారు.  పరిమిత సిబ్బందితో షూటింగులు  జరుపుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. షూటింగులు పూర్తయిన వాటికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవచ్చని తెలిపారు. అయితే థియేటర్లను తెరిచేందుకు మాత్రం ముఖ్యమంత్రి అనుమతించలేదు.

 

లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు థియేటర్లను తెరవడానికి అనుమతిని నిరాకరించింది. వేల మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు. సినిమా, టీవీ షూటింగులకు అనుమతి మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, విధి విధానాలు రూపొందించి సహకరించిన సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: