దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కేసులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  ఓ వైపు పాకిస్థాన్ నుంచి మిడతల దాడులు, తుఫాన్ల దాడులతో పాటు కొంత కాలంగా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువ అయ్యాయి.  ఓ వైపు భారత సైన్యం వారి దాడులను తిప్పికొడుతూనే ఉంది.  తాజాగా దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా లోక్బోవన్‌ లార్కిపోరా గ్రామంలో సోమవారంనాడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌ అజయ్‌ పండిత(40)పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.  ఈ కాల్పుల్లో ఆ సర్పంచ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

 

సర్పంచ్‌ అతని పండ్లతోటలో పనిచేసేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. కాల్పుల అనంతరం సంబంధిత ప్రాంతాల్లో భద్రతా దళాల సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే నేడు తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: