ద‌శాబ్దాలుగా చైనాతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి భారత్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ దేశ ప్రతిష్ఠకు, గౌరవానికి భంగం కలుగనీయబోమని ఆయ‌న‌ స్పష్టం చేశారు. తూర్పు లడఖ్‌లో చైనాతో కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

చైనాతో సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితులను దేశ ప్రజలకు తెలియజేయాలన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ విమర్శలు గుప్పించారు. ఇలాంటి విషయంలో దేశం యావత్తూ ఏకతాటిపై ఉండాలని, రక్షణ బలగాలపై నమ్మకం ఉంచాలని ఆయ‌న‌ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: