లాక్ డౌన్ కి ముందు బార్లలో మిగిలిపోయిన మద్యాన్ని అమ్మడానికి గానూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతులు ఇచ్చింది మద్యాన్ని ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అమ్మే అవకాశాన్ని బార్‌ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ ఈ మేరకు నిన్న సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు. 

 

నిన్నటి నుంచి బార్లకు పబ్ లకు అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వం. దీనితో బార్లలో ఉండిపోయిన మద్యం పాడయ్యే ప్రమాధాలు ఉన్నాయి అని వాటిని అమ్ముకోవడానికి గానూ అనుమతులు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైన్ డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేయడంతో బార్లలో ఉన్న మద్యాన్ని షాపులకు అప్పగించి రశీదు పొందాలని సూచించింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: