హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జీ.హెచ్.ఎం.సీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో జీ.హెచ్.ఎం.సీలో పని చేసే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు నగరంలోని అంబర్ పేట్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
నిన్న ఒక్కరోజే అంబర్ పేట పరిధిలో పది మందికి కరోనా నిర్ధారణ అయింది. నగరంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ప్రతిరోజూ అంబర్ పేట్ పరిధిలో నమోదవుతున్నాయి. దీంతో ఈ ఏరియాపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. నగరంలోని మీర్ పేట్, అమీర్ పేట్, భోలక్ పూర్, గోషా మహల్, గౌతం నగర్, జవహర్ నగర్, ఆర్కే పురంలలో కూడా అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: