ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పందనపై సమీక్ష నిర్వహించారు. శ్యాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే పది రోజుల్లోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే అర్హత ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని అన్నారు. 
 
అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందజేస్తామని అన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పథకాల అమలుకు సంబంధించిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు హాజరయ్యారు. అర్హులై ఉండి పథకాల అమలు జరగకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: