ఢిల్లీలో కరోనా మహమ్మారి ఎవరినీ కనికరించడంలేదు.. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ హోం క్వారంటైన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న కేజ్రీవాల్ కి కరోనా పరీక్షలు చేశారు.  ఈ నేపథ్యంలో ఆయన హూం క్వారంటైన్ కి వెళ్లారు. తాజాగా బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా కరోనా బారినపడ్డారు. అస్వస్థతకు గురైన జ్యోతిరాదిత్యకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.  గత కొద్ది రోజులుగా జ్యోదిరాదిత్య జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుండగా, ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలు బయటపడలేదు.

 

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేలు దాటింది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడుతోంది. ఒక దశలో కరోనా కేసులు ఢిల్లీ నుంచి మొదలయ్యాయని కూడా అటున్నారు.. ఆ మద్య మర్కజ్ సమావేశాల్లో పాల్గొన్న వారంతా వివిధ రాష్ట్రాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అందులో చాలా మందికి కరోనా పాజిటీవ్ వచ్చిన వారే ఉన్నారని అధికారులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: