దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కరోనా రాజధానిగా ఉంది అనేది వాస్తవం. అక్కడ కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. వందల కేసుల నుంచి ఇప్పుడు వేల కేసులకు వెళ్ళింది కరోనా కేసుల పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఢిల్లీలో 1366 కొత్త  కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం 18543 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 11861 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 905 మంది కరోనా కారణంగా మరణించారు. దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 31309 వద్ద ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: