నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సహా ఇప్పటికే చాలా మంది బాలయ్యకు విష్ చేసారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా బాలయ్యకు విష్ చేసారు. “అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. 

 

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మావయ్యా... మీరు మరెన్నో చిత్రాల్లో నటించి... మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: