ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు శుభవార్త చెప్పారు. జగనన్న చేదోడు పథకంలో భాగంగా అర్హులైన వారి ఖాతాలో 10,000 రూపాయల చొప్పున నగదు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో వీళ్ల దగ్గరకు వెళ్లి ప్రజలు సేవలు చేయించుకోలేకపోయారని అన్నారు. ప్రతి ఒక్కరికీ చేయూత అందించడమే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. 
 
రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు తమ చెమటను నామ్ముకుని శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 2,47,040 మంది లబ్ధిదారులకు నగదు జమ చేస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో వీరి పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని 3.58 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందాయని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: