టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్ళారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. ఆయనతో పాటుగా భార్య భువనేశ్వరి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కూడా వెళ్లినట్టు సమాచారం. 

 

ఇప్పటికే లోకేష్ ట్విట్టర్ వేదికగా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సుహాసిని అందరూ కూడా బాలయ్యకు విష్ చేసిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేసారు. ఇక ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలను జరుపుతున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే పుట్టిన రోజు వేడుకులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: