బీహార్ రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ నుంచి హోం క్వారంటైన్ కు వెళ్లే వలస కూలీలకు 17 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసింది. బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రానికి లక్షల సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చారని... వారిలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి ఈ పద్ధతిని ఫాలో అయ్యామని వ్యాఖ్యలు చేశారు. 
 
గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లతో ఉన్న కిట్‌లను పంపిణీ చేశామని.... కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేసిన వలస కార్మికులకు సర్కార్ వాటిని బహుమానంగా ఇచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లు లభిస్తాయని... ఎవరికైనా వాటి అవసరం ఉంటే సంప్రదించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: