యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువురు హీరోలు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా 60వ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు.. ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాతలు సైతం ట్విట్ట‌ర్లో బాల‌య్య‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఇక మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ బాల‌య్య సినిమాల విష‌యంలో ఎప్పుడూ పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటాడు. గ‌తంలో ఓ సారి ఖైదీ నెంబ‌ర్ 150కు పోటీగా బాల‌య్య గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమా కూడా రిలీజ్ అయ్యింది.

 

 

అప్పుడు త‌న మామ చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో పాటు బాల‌య్య శాత‌క‌ర్ణి కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాల‌ని విషెస్ చెప్పాడు. అప్ప‌టి నుంచి బాల‌య్య అభిమానులు కూడా సాయిధ‌ర‌మ్ సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు. తాజాగా బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా బోయ‌పాటి - బాల‌య్య సినిమాలోని ప‌వ‌ర్ ఫుల్ లుక్‌ను పోస్ట్ చేసిన సాయి బాల‌య్య గారికు 60 వ పుట్టినరోజు శుభాకాంక్షలు ... దేవుడు మీకు మరింత శక్తిని మరియు ఆనందాన్ని ఇస్తాడు ... వెండితెరపై మీరు మీ ఎన‌ర్జీతో మ‌మ్మ‌ల‌ను ఎప్పుడూ అల‌రించాల‌ని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేయ‌డంతో పాటు బాల‌య్య‌, నంద‌మూరి అభిమానుల మ‌న‌స్సుల‌ను మ‌రోసారి గెలుచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: