యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా సోష‌ల్ మీడియాలో పుట్టిన రోజు విషెస్ చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌దైన స్టైల్లో బాల‌య్య‌కు విషెస్ చెప్పాడు. పూరి బాల‌య్య‌తో పైసా వ‌సూల్ సినిమా చేశాడు. ఈ సినిమాలో పూరి బాల‌య్య‌ను చాలా స‌రికొత్త లుక్‌తో ప్ర‌జెంట్ చేశాడు. ఇక బాల‌య్య కుమారుడు మోక్షు డెబ్యూ మూవీకి కూడా ద‌ర్శ‌కుడిగా పూరి పేరు విన‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

తాజాగా బాల‌య్య‌కు విషెస్ చెప్పిన పూరి బాల మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అని పోస్ట్ చేయ‌డంతో పాటు బాల‌య్య బాబును ఆయ‌న అభిమానులు ముద్దుగా పిలుచుకునే డైలాగ్ కూడా పూరి పోస్ట్ చేశాడు. కోకో కోలా పెప్సీ.. బాల‌య్య బాబు సెక్సీ అంటూ బాల‌య్య ఫ్యాన్స్ కేక పెట్టించేలా విషెస్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: