సింగపూర్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం ఇంకా పెరుగుతున్నాయి. వందల కేసులు నమోదు అవుతున్నాయి ఆ దేశంలో. నేడు కూడా దాదాపు 500 కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా మరో 451 మందికి కరోనా సోకింది అని అధికారులు పేర్కొన్నారు. 

 

దీనితో కరోనా మొత్తం బాధితుల సంఖ్య 38,965కి చేరింది. ఈ నేపధ్యంలో సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు కీలక హెచ్చరికలు చేసింది. అత్యవసరం అనుకుంటే మినహా ఎవరూ కూడా బయటకు రావొద్దు అని స్పష్టం చేసింది సింగపూర్ ప్రభుత్వం. సామాజిక వ్యాప్తి మొదలయింది అని కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: