తమ రాష్ట్రంలోకి ఎవరు రావాలి అన్నా సరే కరోనా పరిక్షలు తప్పనిసరి అని గోవా సర్కార్ స్పష్టం చేసింది. అక్కడ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా పెరగడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పుడు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోకి ప్రజలు రావాలంటే కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ఈ కొత్త ప్రణాళికను అమలు చేయడానికి ప్రభుత్వం ఎస్ఓపీలో మార్పు తీసుకువచ్చిందని ఆ రాష్ట్ర సిఎం వివరించారు. 

 

గురువారం నుంచి ఎవరు వచ్చినా సరే కరోనా పరిక్షలు చేసిన తర్వాతే అనుమతి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని ఆ రాష్ట్ర సిఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. ఎంట్రీ పాయింట్ ల వద్ద కరోనా పరిక్షలు చేస్తామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: