ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై కరోనా టెస్టుల ఫలితాలు సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించే విధానంలో కొన్ని లోపాలు ఉండటంతో జగన్ సర్కార్ నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. సాధారణంగా కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాత ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. 
 
ఆన్లైన్ ద్వారా వైద్యులు, ఆసుపత్రి సూపరిటెండెంట్లకు కరోనా పరీక్షల ఫలితాలను తెలియజేస్తారు. అందులో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉండటంతో కరోనా టెస్ట్ ఫలితాలను నేరుగా చేయించుకున్న వ్యక్తి సెల్‌ఫోన్‌కే మెసేజ్ ద్వారా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ పంపే లింకు ఆధారంగా కూడా కరోనా ఫలితాన్ని చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: