హైదరాబాద్ లో కరోనా ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు వేగంగా నమోదు కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా ఇబ్బంది పడుతుంది. కరోనా కట్టడిలో చర్యలు తీసుకున్నా సరే పదుల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. తాజా లెక్కలు చూస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత పది రోజుల్లో 1,053 మందికి వైరస్‌ సోకిందని లెక్కలు చెప్తున్నాయి.

 

మే మొదటి వారం నుంచి కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువగా పోలీసులు కూడా ఉంటున్నారు. అటు ప్రభుత్వ విభాగాల్లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే హైదరాబాద్ లో 143 మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: