దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో కరోనా రోగులు ఆస్పత్రి నుంచి తప్పించుకుని పోవడం, మృతదేహాలు మిస్సింగ్ కావడం లాంటి ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని జలగాం జిల్లా కరోనా ఆస్పత్రిలో కొన్ని రోజుల క్రితం కరోనా రోగి మృతదేహం మాయమైంది. 
 
ఆసుపత్రిలో 8 రోజులుగా అదృశ్యమైన కరోనా మహిళా రోగి మృతదేహం తాజాగా ఆస్పత్రి మరుగుదొడ్డిలో ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతయింది. భూసావాల్ గ్రామానికి చెందిన 82 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకడంతో ఆమెను కొన్నిరోజుల క్రితం జలగాం కరోనా ఆస్పత్రిలో చేర్చారు. కరోనా రోగి మృతదేహమై మరుగుదొడ్డిలో లభించిన ఘటనపై దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు జిల్లా మంత్రి గులాబ్ రావ్ పాటిల్ లు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: