గ్రామాల్లో పర్యటనకు సిద్దమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గ్రామ వార్డు సచివాలయం కి సంబంధించిన సమీక్షలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. అర్హులు ఎవరికి కూడా పథకాలు అందడం లేదు అని చేతులు ఎత్తకూడదు అని సిఎం అధికారులను ఆదేశించారు. 

 

ఏ ఒక్కరు చేతులు ఎత్తినా సరే అధికారుల మీద ముందు చర్యలు ఉంటాయి అని ఆయన స్పష్టం చేసారు. ఆరోగ్య శ్రీ పెన్షన్లు, ఇళ్ళ పట్టాలు వంటి వాటి మీద దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులు అందరికి పథకాలు అందాలి అని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో ఆగస్ట్ నెల నుంచి పర్యటనకు వస్తా అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన గ్రామాల్లోకి ఆయన తొలిసారి వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: