తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం కూడా ఆగలేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆ రాష్ట్రంలో ఫలితం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. ప్రతీ రోజు కూడా వందల కేసులు నమోదు అవుతున్నాయి ఆ రాష్ట్రంలో. 

 

తాజాగా మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు తమిళనాడులో 1875 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు పేర్కొన్నారు. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 38716 వద్ద ఉందని ప్రభుత్వం తెలిపింది. వీటిలో 17659 క్రియాశీల కేసులు ఉన్నాయని...  20705 మంది డిశ్చార్జ్  అయ్యారు అని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 349 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు అని  రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: